నో హెల్మెట్ నో డ్రైవ్ కార్యక్రమం

Mar 19, 2026 - 02:33
 0  2
నో హెల్మెట్ నో డ్రైవ్ కార్యక్రమం

నో హెల్మెట్ నో డ్రైవ్ కార్యక్రమం.

తిరువూరు, మార్చి 18(వెలుగు నాడు ప్రతినిధి) : ఎన్టీఆర్ జిల్లా,తిరువూరు నియోజకవర్గం, ఎ.కొండూరు మండలం లో గల ప్రధాన రహధారి లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మరియు వాహనదారుల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు ఎ.కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో “నో హెల్మెట్ – నో డ్రైవ్” కార్యక్రమాన్ని నిర్వహించారు ఎస్‌.ఐ జి. మహాలక్ష్మణుడు.ఈ సందర్భంగా ప్రధాన రహదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి వారి వాహనాలకు సంబంధించిన ఆర్‌.సి, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారి తీసే అవకాశముందని పోలీసులు సూచించారు.హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు వెంటనే హెల్మెట్లు కొనుగోలు చేసి ధరించాలని సూచించారు. కొంతమంది వాహన దారులు అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేసి ధరించారు భవిష్యత్తులో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్‌.ఐ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ జి.కృష్ణ,ఆర్.చక్రవర్తి,యూ. తిరుపతిరావు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్