రోడ్డు విస్తరణలో ఎవరికీ ఇబ్బందులుండవు ఎమ్మెల్యే శ్రీరాం
రోడ్డు విస్తరణలో ఎవరికీ ఇబ్బందులుండవు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట,ఫిబ్రవరి 05,( వెలుగు నాడు ప్రతినిధి ) : పట్టణంలోని కోదాడ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నారు.విస్తరణ పనుల ప్రారంభానికి ముందుగా అధికారులు, నాయకులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) గురువారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోడ్డుకు ఇరువైపులా ఉన్న గృహాల ప్రజలతో మాట్లాడి, ఎవరికీ ఇబ్బందులు కలగకుండా రోడ్డు విస్తరణ చేపడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎల్ ఎస్ సీ ఎస్ సొసైటీ చైర్మన్ ధూళిపాళ్ల లక్ష్మణరావు, కౌన్సిలర్ గింజపల్లి వెంకటరావు, కాచవరం కాలువ చైర్మన్ కానూరి కిషోర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గుత్తికొండ శ్రీనివాసరావు, కళ్యాణం సూర్యప్రకాష్,గింజుపల్లి కృష్ణ,కసుకుర్తి రాజేష్,అట్లూరి వెంకటేశ్వరరావు, తుమ్మేపల్లి చిన్న,ఎలక్ట్రికల్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0