బిసివై స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పచ్చిపాల
బిసివై స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పచ్చిపాల
జగ్గయ్యపేట,ఫిబ్రవరి 04, ( వెలుగు నాడు ప్రతినిధి ) : భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కు చెందిన నాయకుడు పచ్చిపాల నాగేశ్వర రావుకు స్థానం లభించింది. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్న ఆయన సేవలను గుర్తించిన బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్, ఆయనను ఈ పదవిలో నియమించారు.బుధవారం బిసివై పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.ఈ నియామకంపై నాగేశ్వర రావు తన స్పందనను తెలియజేస్తూ,బిసివై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో తనకు చోటు కల్పించినందుకు అధినేత రామచంద్రయాదవ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని అన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0