నదీ నదాలనూ వదలని కాలుష్యం

Feb 4, 2026 - 02:08
Feb 4, 2026 - 02:09
 0  1
నదీ నదాలనూ వదలని కాలుష్యం

నదీ నదాలనూ వదలని కాలుష్యం

జగ్గయ్యపేట ఫిబ్రవరి03 (వెలుగునాడు ప్రతినిధి) వాళ్ళు జగ్గయ్యపేట నియోజకవర్గంలో కాలుష్య కర్మాగారాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి.సిమెంట్ కర్మాగారాలు వెదజల్లే కాలుష్యం మొత్తం వాతావరణం కలుషిత మవుతుంటే పట్టణ శివారు ఆటో నగర్ రసాయన కర్మాగారాల నుండి వచ్చే రసాయనాలతో జగ్గయ్యపేటలో భూగర్భజలాలు క్రమంగా విషవూరిత మవుతున్నాయి.ఇదిలావుండే కాలుష్య భూతం కృష్ణా నదిని సైతం వదిలిపెట్టడం లేదు.పావన కృష్ణానది తీరాన వేదాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి8 వెళ్లిన భక్తులకు ఓ వింత కలకలం రేపుతోంది.నదీ స్నానాలకి వెళ్లే భక్తులకు నీళ్లల్లో ఆకుపచ్చ రంగు తేలుతూ కనిపించింది.ప్రవహించే నీటిలో కొట్టుకు వస్తున్న ఆకుపచ్చని కెమికల్ తీవ్రదుర్వాసన వెదజల్లుతుంది.ఈ వాసనతో భక్తులు ఇక్కట్లు పడుతూ ఉన్నారు సాలగ్రామ నరసింహ చుట్టూ ఈ కెమికల్ కనిపించటం బాధాకరం.పవిత్ర గంగా జలాన్ని కూడా కెమికల్ తో సర్వనాశనం చేస్తున్నారు.నదికి పైప్రాంతంలో ఉన్న కర్మాగారాలనుండి ఈ కాలుష్యం నదిలోకి వస్తోంది.ఈ అక్రమార్కులపై సంబంధిత అధికారులు తక్షణమే కఠినచర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.ఈ నీటి వల్ల నీటిలో ఉండే జీవరాశులు కూడా కనుమరుగైపోతాయి.స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు పవిత్ర గంగాజలంగా కృష్ణానది నీటిని పట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లి తీర్థంగా స్వీకరించే ఈ జలం ఇంత కలుషితమై పోతూ ఉంటే అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు.జగ్గయ్యపేట క్రాస్ రోడ్ ఆటోనగర్ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల పుణ్యమా అంటూ చర్మవ్యాధులతో కొత్త వింత రోగాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.ఎటువంటి చర్యలు లేకపోవడం వల్ల జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది.వరదలు వస్తే మనుషుల ప్రాణాలకు హాని జరుగుతుంది అని ముందు చర్యలు చేపట్టే అధికారులు నాయకులు, త్రాగునీరు మొత్తం కలుషితమై నదులు కూడా కలుషితమై పోతూ ఉంటే,అత్యంత ప్రమాదకరంగా మారుతున్న ఈ దారుణ ఘటనలకు కారకులైన దుర్మార్గులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్