నాగిరెడ్డిగూడెం గ్రామంలో మంచిన నీళ్లు లేక అవస్థలు
నాగిరెడ్డిగూడెం గ్రామంలో మంచిన నీళ్లు లేక అవస్థలు
ఏలూరు, జనవరి 19, ( వెలుగు నాడు ప్రతినిధి) : ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని నాగిరెడ్డి గూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా మంచినీటి ఎద్దడి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని త్రాగడానికి, అవసరాలకు వాడుకోవటానికి కూడ నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఒకే మోటార్ తో నీరు సరిపోవడం లేదని మూడు రోజులైనా నీరు రాక ఇబ్బందులు గురవుతున్నామని. తెలిపారు. ప్రస్తుత పరిస్థితి ఇబ్బంది పడుతుంటే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని అన్నారు. ఎత్తులో ఉండటం వల్ల పల్లం లోకి నీళ్లు వెళుతున్నాయని ఆ నీటిని మోటార్లు పెట్టి ఇళ్లలోకి ర ప్పించుకుంటున్నారని తెలిపారు. 30 ఇండ్ల కు నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని ప్రస్తుతం ఒక మోటార్ తో నీళ్లు పంపిస్తున్నారని కానీ ఒక మోటార్నీళ్లు సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.క్రొత్త లైన్ వేసి గేటు వాలు బిగిస్తే నీరందుతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన సమస్య పరిష్కరించడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0