ప్రతిమా సింగ్ జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకారం

Feb 27, 2026 - 00:56
 0  4
ప్రతిమా సింగ్ జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకారం

ప్రతిమా సింగ్ జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకారం

మెదక్, ఫిబ్రవరి 26 (వెలుగు నాడు ప్రతినిధి) : మెదక్ జిల్లా పాలనాధికారిగా ప్రతిమా సింగ్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో మెదక్ అదనపు పాలనాధికారిగా సేవలందించిన ఆమె ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. అదనపు కలెక్టర్ నగేష్ సహా జిల్లా అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, తన పరిపాలన అనుభవంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, ప్రజల సమస్యల వేగవంతమైన పరిష్కారం, పారదర్శక పరిపాలన మరియు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.జిల్లా ప్రజల సహకారంతో మెదక్‌ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన కలెక్టర్ రాహుల్ రాజ్ సహకార శాఖకు బదిలీ అయ్యారు. జిల్లా అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేస్తానని నూతన కలెక్టర్ తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్