ప్రెస్ క్లబ్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య 

Jan 29, 2026 - 00:15
 0  21
ప్రెస్ క్లబ్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య 

ప్రెస్ క్లబ్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య 

తిరుపతమ్మ భక్తులకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం 

జగ్గయ్యపేట, జనవరి 28, (వెలుగు నాడు ప్రతినిధి ) : జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్, ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలు గోపయ్య సమేత తిరుపతమ్మ భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం పట్టణములోని రంగుల మండపం లో రంగుల మహోత్సవం పూర్తిచేసుకుని స్వామి అమ్మవార్ల సహదేవతలతో పెనుగంచిప్రోలు ఆలయానికి తిరిగి వెళ్లే మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఎన్టీఆర్ సర్కిల్ లో పాత మున్సిపల్ కార్యాలయ ప్రాంతంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ కౌన్సిల్ ప్రతినిధి ముత్యాల సైదేశ్వరావు, జిల్లా కమిటీ ప్రతినిధి కట్టా గురవయ్య, అటహాక్ కమిటీ ప్రతినిధులు అల్లి రవిచంద్ , సందల శ్రీనివాసరావు,, దండ రామకృష్ణ, కటకం ప్రసాద్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింటర్ ఎలక్ట్రాని మీడియా విలేకరులు అమ్మవారి భక్తులకు భోజన పదార్థాలు అందజేయటంఅభినందనీయమన్నారు. సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేసే విలేకరులు జగ్గయ్యపేట పట్టణంలో జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొనసాగిన అన్నదాన కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్ తులసి వెంకటకృష్ణారావు,తిరుపతమ్మ తల్లి ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్, డైరెక్టర్ అప్పారావు ఏ సి పి తిలక్ ,జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, జగ్గయ్యపేట ఎస్సైలు రాజు, శంకర్ నాయక్, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసు, చిలకల ఎస్ఐ సూర్య, చిలకల టు ఎస్ ఐ మణికంఠ, మున్సిపల్ వైస్ చైర్మన్ లు తుమ్మల ప్రభాకర్ రావు, హాఫీజున్నీసా ఫిరోజ్ ఖాన్ లు పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కొలగంటి ఆనందబాబు, పాపగంటిఆశీర్వాదం, విజయ్, వెంకట్రావు ,వెంకటరమణ , శివ రామకృష్ణ, షేక్ బాషా, చేని రాంబాబు, గోపి, అన్నే పాగా విజయ్ ,వివిధ శాఖల అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్