దేశానికి రక్షణ కవచం ఆర్ ఎస్ ఎస్ 

Mar 21, 2026 - 02:26
 0  2
దేశానికి రక్షణ కవచం ఆర్ ఎస్ ఎస్ 

దేశానికి రక్షణ కవచం ఆర్ ఎస్ ఎస్ 

ఎస్ ఎస్ ఎఫ్ ప్రాంత సహ సంయోజక్ సాయిరాం

జగ్గయ్యపేట,మార్చి19, (వెలుగు నాడు ప్రతినిధి ) : దేశానికి నేడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్) రక్షణ కవచంగా తయారైందని సమరసతా సేవా ఫౌండేషన్ ప్రాంత సహ సంయోజక్ సాయిరాం అన్నారు. ఆర్ ఎస్ ఎస్ జగ్గయ్యపేట ఖండ ఆధ్వర్యంలో స్థానిక ఉక్కు కళావేదికలో జరిగిన ఉగాది ఉత్సవ్ కార్యక్రమంలో సాయిరాం ముఖ్యవక్త గా పాల్గొన్నారు.1925 లో కేవలం ఐదుగురు వ్యక్తులతో ప్రారంభమైన ఆర్ ఎస్ ఎస్ ఈ రోజు దేశ వ్యాపితమైందని,సమాజానికి దేశానికి రక్షగా నిలిచిందని అన్నారు.నేడు స్వయంసేవకులు అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్నారని అన్నారు.సంఘ స్థాపన జరిగి నూరేళ్ళయిన సందర్భంగా సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి, శాఖల విస్తరణకు మరింతగా కృషి చేయడానికి ఉగాది సందర్భంగా దృఢ నిర్ణయం తీసుకోవాలని స్వయంసేవకులకు పిలుపునిచ్చారు.ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సంస్కృత ఉపన్యాసకులు వడ్డేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘ కార్య విశిష్టతను,ఆవశ్యకత ను వివరించారు.ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ బాలగంగాధర్ తిలక్, సంఘ పెద్దలు,పెద్ద సంఖ్యలో స్వయం సేవకులు పాల్గొన్నారు.అనంతరం పట్టణంలోని ప్రధాన మార్గాల ద్వారా ఆర్ ఎస్ ఎస్ స్వయం సేవకులు పథసంచలనం(రూట్ మార్చ్) కార్యక్రమం నిర్వహించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్