మెట్టగుట్టలో వైభవంగా 'రథసప్తమి వేడుకలు
మెట్టగుట్టలో వైభవంగా 'రథసప్తమి' వేడుకలు
గంపలగూడెం, ఫిబ్రవరి 24(వెలుగు నాడు ప్రతినిధి ) : గంపలగూడెం మండలం మెట్టగుట్టలోని శ్రీశేషాచల శ్రీనివాసస్వామి ఆలయంలో రథసప్తమి వేడుక ఆదివారం వైభవంగ నిర్వహించారు. అర్చకులు శ్యాంసుందర శ్రీనివాసాచార్యులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసస్వామి ఉత్సవ విగ్రహాలను సూర్యప్రభవాహనంపై ఆశీనులను చేసి పూలు, పూలదండలతో విశేషంగా అలంకరించి పూజలు జరిపారు. భక్తులకు సూర్యోప్రాసనలు, వాటి విశిష్టతను విశదీకరించారు. సూర్య భగవానుడిని ప్రార్ధించటం వలన కలిగే ఆరోగ్య విషయాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పంది వెంకట్రావు, అభివృద్ధి కమిటీ సభ్యులు నంబూరి శ్రీనివాసరావు, సభ్యులు వి.కృష్ణారెడ్డి, ఆర్.వెంకట సుబ్బారావు, బి.కృష్ణ, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0