జగనన్న లేఔట్ లో సమస్యలు వెంటనే పరిష్కరించండి
జగనన్న లేఔట్ లో సమస్యలు వెంటనే పరిష్కరించండి
వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ తన్నీరు
జగ్గయ్యపేట మార్చి14 (వెలుగు నాడు ప్రతినిది) : స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ చొరవ తీసుకొని జగనన్న లే అవుట్లలో మౌళిక సదుపాయాలు వెంటనే పరిష్కరించాలని వైసీపీ జగ్గయ్యపేట ఇంచార్జి తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.జగ్గయ్యపేట పట్టణం, బలుసుపాడు రోడ్డు, జగనన్న లేఅవుట్ -2 లో సరైన మౌలిక సదుపాయాలు లేని విషయాన్ని తెలుసుకొని తన్నీరు నాగేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్న), పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ స్థానిక నాయకులు కలిసి శనివారం లేఅవుట్లలో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.నీటి సమస్య,వీధి దీపాలు సమస్య,రేషన్ సమస్య, రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను పరిష్కరించాలని అక్కడి నివాసితులు వైసీపీ నాయకుల దృష్టికి తీసుక వచ్చారు.ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ మాటలకే పరిమితం తప్ప ప్రజల సమస్యలు కనబడవని అన్నారు.సమస్యలను వారం లోపల పరిష్కరించకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, రాష్ట్ర చేనేత విభాగ కార్యదర్శి పెంటి శ్రీనివాసరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, సీనియర్ నాయకులు లాహోరి బద్దు నాయక్, స్థానిక నాయకులు జక్కులూరి సురేష్, ఆనందరావు, పట్టణ యువజన విభాగ అధ్యక్షులు రామిని ఉపేందర్ రెడ్డి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు పిడమర్తి ప్రభువు, మున్సిపల్ వింగ్ అధ్యక్షులు అన్నేపాక మురళి, వార్డు అధ్యక్షులు గుంజ రోశయ్య, మన్నే అప్పారావు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఉసా సురేష్, జిల్లా మహిళా కార్యవర్గ సభ్యులు షేక్ దూదాబి, మండల యువజన అధ్యక్షులు కీసర లోకేష్, షేక్ ఖాదర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0