స్వర్ణాంధ్ర ' పురోగతిపై సమీక్షా సమావేశం
' స్వర్ణాంధ్ర ' పురోగతిపై సమీక్షా సమావేశం
జగ్గయ్యపేట, జనవరి19, (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట మండల పరిషత్ కార్యాలయంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) అధ్యక్షతన సోమవారం ‘స్వర్ణాంధ్ర -2047’ కార్యక్రమానికి సంబంధించిన కీలక పనితీరు సూచికల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్‌లో సూచికలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులకు వివరించారు.మండల పరిధిలో ప్రస్తుతం బీ మరియు సీ గ్రేడ్‌లలో ఉన్న పనితీరు సూచికలను గుర్తించి, వాటిని అత్యున్నత స్థాయి ఏ గ్రేడ్‌కు తీసుకెళ్లే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేసి, మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.ఈ సమీక్షా సమావేశంలో జగ్గయ్యపేట మండల పరిషత్ అధికారి నితిన్,యంగ్ ప్రొఫెషనల్ నరేష్, డిప్యూటీ ఎస్ఓతో పాటు వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొని, తమ శాఖల పురోగతిపై వివరాలు తెలియ జేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0