సేవా భావానికి నిదర్శనం ఎస్ ఐ గౌరీశ్వరి

Apr 3, 2026 - 02:23
 0  6
సేవా భావానికి నిదర్శనం ఎస్ ఐ గౌరీశ్వరి

సేవా భావానికి నిదర్శనం ఎస్ ఐ గౌరీశ్వరి

పరిపూర్ణ బాలల ఆశ్రమానికి కూలర్ వితరణ

తిరువూరు, ఏప్రిల్ 02,( వెలుగు నాడు ప్రతినిధి) : తిరువూరు మహిళా సబ్ ఇన్స్పెక్టర్ గౌరిశ్వరి ఆశ్రమంలోని చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూలర్‌ను వితరణగా అందించారు.ప్రస్తుతం ఎండాకాలం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆశ్రమంలో నివసిస్తున్న చిన్నారులు వేడిమిని తట్టుకోవడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని గుర్తించిన ఎస్‌ఐ గౌరిశ్వరి , వారికి చల్లని వాతావరణం కల్పించాలనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి కూలర్‌ను అందించడం విశేషం.ఈ సహాయం వల్ల చిన్నారులు ఎంతో ఆనందంగా, సౌకర్యంగా ఉండగలుగుతున్నారని ఆశ్రమ సిబ్బంది తెలిపారు.ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు సిరికొండ నాగేశ్వరరావు (అభి) మరియు వరలక్ష్మి మాట్లాడుతూ, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రావడం ఎంతో అభినందనీయం అన్నారు.చిన్నారుల ఆరోగ్యం, సౌకర్యం పట్ల చూపిన శ్రద్ధకు ఎస్‌ఐ గౌరిశ్వకి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, మరింత మంది సేవా భావంతో ముందుకు రావాలని ఆశిస్తూ కార్యక్రమం ముగిసింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్