సెక్రటరీలు సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి
సెక్రటరీలు సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి
మున్సిపల్ కమీషనర్ ప్రసాదరావు
జగ్గయ్యపేట జూన్11, (వెలుగు నాడు ప్రతినిధి ) : సచివాలయ కార్యదర్శులు సచివాలయాల్లో వుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కొత్తగా నియమితులైన మున్సిపల్ కమీషనర్ పి వి వి డి ప్రసాద్ రావు సూచించారు.గురువారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు స్వర్ణ వార్డు సెక్రటరీలతో ఆయన సమావేశం నిర్వహించారు.ఈ రివ్యూ నందు సెక్రటరీలకు పలు విషయాలపై సూచనలు జారీ చేశారు. సెక్రటరీలు సచివాలయం నందు అందుబాటులో ఉండాలని సేవల కొరకు వచ్చిన ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి వచ్చిన పనిని పూర్తి చేసి పంపవలసిందిగా ఆదేశించారు..అలాగే యోగాంధ్ర -2026,సెన్సెస్, సర్ లాంటి పలు సర్వేలను సకాలంలో పూర్తిచేసి జగ్గయ్యపేట పురపాలక సంఘమును ముందంజలో ఉండేటట్లుగా విధులు నిర్వహించాలని అన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0