దివ్యాంగులకు కృత్రిమ కాళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేక క్యాంపు

May 18, 2026 - 12:18
 0  7
దివ్యాంగులకు కృత్రిమ కాళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేక క్యాంపు

దివ్యాంగులకు కృత్రిమ కాళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేక క్యాంపు

జగ్గయ్యపేట, మే17, (వెలుగు నాడు ప్రతినిధి )  : వివిధ కారణాలతో కాళ్లు కోల్పోయిన దివ్యాంగులకు కృత్రిమ కాళ్ల ఏర్పాటు కోసం ఆదివారం స్థానిక జెఆర్సి కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. అమెరికాకు చెందిన “ఏకముస” స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్వయం శక్తి దివ్యాంగుల సమాఖ్య జగ్గయ్యపేట నియోజకవర్గ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు వడ్డెపూడి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టారు.ఈ క్యాంపులో సుమారు 50 మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్ల కొలతలు తీసుకున్నారు. వీరికి వచ్చే 10 నుండి 15 రోజుల్లో జైపూర్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన కృత్రిమ కాళ్లను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుండి దివ్యాంగులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దివ్యాంగులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి సహకరించిన ఏకముస సంస్థ ప్రతినిధులురంగారావు,సాంబశివరావు, రోటరీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల నుండి కూడా దివ్యాంగులను సమకూర్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వడ్డెపూడి ఉమామహేశ్వరరావును ప్రత్యేకంగాఅభినందించారు.అవసరమైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వం ద్వారా తగిన సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 1
admin వెలుగునాడు తెలుగు న్యూస్