ఇంధన పొదుపుతో మహానాడు రాజకీయాల్లో టిడిపి కొత్త ట్రెండ్

May 16, 2026 - 22:16
 0  5
ఇంధన పొదుపుతో మహానాడు రాజకీయాల్లో టిడిపి కొత్త ట్రెండ్

ఇంధన పొదుపుతో మహానాడు రాజకీయాల్లో టిడిపి కొత్త ట్రెండ్!

సంక్షేమం అభివృద్ధి” ద్విచక్రంతో ప్రజల్లోకి వెళ్లాలి : దేవినేని ఉమా

అమరావతి మే 16, (వెలుగు నాడు ప్రతినిధి) : ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగుదేశం పార్టీ మహానాడును ఈసారి హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించడం భారత రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతోందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సూచించిన ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణ చర్యలను ఆచరణలో అమలు చేస్తూ టిడిపి వినూత్న నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.శనివారం మంగళగిరి కేంద్ర టిడిపి కార్యాలయంలో జరిగిన యూనిట్, క్లస్టర్ ఇంచార్జిల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న దేవినేనిఉమామహేశ్వరరావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయిలో మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. “ప్రజల విశ్వాసమే పార్టీకి అసలైన బలం” అని పేర్కొంటూ, ప్రతి ఇంటికీ ప్రభుత్వం చేసిన మేలు చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.సూపర్ సిక్స్ హామీలతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా అంతకంటే ఎక్కువ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని దేవినేని ఉమా వివరించారు. మహిళలు, యువత, రైతులు, ఉద్యోగులు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను స్పష్టంగా ప్రజలకు వివరించాలని సూచించారు.పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా, డిజిటల్ వేదికలను సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రభుత్వ పనితీరును వాస్తవాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మహానాడు కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదని, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశను నిర్దేశించే వేదికగా నిలవబోతుందని పేర్కొన్నారు.ఇంధన పొదుపు, సమయ నిర్వహణ, సాంకేతిక వినియోగం కలగలిపిన హైబ్రిడ్ మహానాడు నిర్వహణతో దేశ రాజకీయాల్లో టిడిపి మరోసారి ఆదర్శంగా నిలుస్తోందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్