ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం
ఎంపీ కేశినేని చిన్ని
ఎన్టీఆర్ బ్యూరో ఫిబ్రవరి 28 సూర్య న్యూస్ జిల్లా పరిధిలోని, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వారం క్రమం తప్పకుండా ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తుందని టిడిపి నాయకులు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకూడదనే ఉద్దేశ్యంతో ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతివారం ఒక డివిజన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు శనివారం పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్ పాత రాజేశ్వరి పేటలోని సాయిబాబా గుడి రోడ్ , కరీముల్లా టీ సెంటర్ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించటం జరిగింది. టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్ప భవకుమార్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుఖాసి కిరణ్, క్లస్టర్ ఇన్చార్జ్ ధనేకుల సుబ్బారావు, 56వ డివిజన్ ప్రెసిడెంట్ పెద్దిన శ్యామ్ సుందర్, టిడిపి సీనియర్ నాయకులు కరణం జగన్ మోహన్ రావు లు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ ప్రజాదర్భార్ కి ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు అధిక సంఖ్యలో తరలిరావటం జరిగింది.టిడిపి నాయకులు ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి నుంచి ఆర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరగా, అధికారులు కొన్ని సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించారు.ఈ ప్రజా దర్బార్ లో రేషన్ కార్డ్ మ్యాపింగ్, కొత్త రేషన్ కార్డ్, టిడ్కో ఇళ్లు, ఇంటి స్థలాలు, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యలు, సీనియర్ సిటిజన్ సమస్యలపై ప్రజలు ఎక్కువగా ఆర్జీలు పెట్టుకున్నారు.ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు అందించారు. అధికారులు కొన్ని అర్జీలను అక్కడిక్కడే పరిష్కరించారు.ఈ ప్రజా దర్బార్ లో రేషన్ కార్డ్ మ్యాపింగ్, కొత్త రేషన్ కార్డ్, టిడ్కో ఇళ్లు, ఇంటి స్థలాలు, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యలు, సీనియర్ సిటిజన్ సమస్యలపై ప్రజలు ఎక్కువగా ఆర్జీలు పెట్టుకున్నారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఈ ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి సమస్యను ఆన్‌లైన్ చేసి ఫిర్యాదు చేసిన వారి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ను కూడా పంపుతున్నామని, ప్రజాదర్భార్‌లో తెలియజేసిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పరిపాలనలో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ ఒక వేదికగా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్, జిల్లా వాణిజ్య విభాగ ఉపాధ్యక్షుడు దనేకుల హరికృష్ణ, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్. మాధవ, ఉపాధ్యక్షుడు భవానీ శంకర్, పశ్చిమ నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు మోడీ రాజు, పశ్చిమ నియోజకవర్గ ఐటిడిపి ప్రధాన కార్యదర్శి బోగవల్లి రమేష్, ఐటిడిపి జిల్లా నాయకురాలు స్రవంతి, ఐటిడిపి నాయకురాలు ప్రియ, పుప్పాల దుర్గా, తెలుగు మహిళ అధికార ప్రతినిధి పట్నాల భార్గవి, టిడిపి మహిళా సినియర్ మహిళ నాయకురాలు బంకా నాగమణి, టిడిపి మహిళ నాయకులు మౌనిక, దుర్గా శాంతి, 56వ డివిజన్ ప్రధాన కార్యదర్శి రియాజ్, యూనిట్ ఇన్చార్లు రాజు, బడేషా, టిడిపి నాయకులు నాయుడు, డివిజన్ అధ్యక్షులు బూదాలి నందకుమారి, కుంచం దుర్గారావు, డివిజన్ నాయకులు చీట్ల శివ,బసవేశ్వరరావు, తిలక్ రామ్ సింగ్, శేషారావు, డివిజన్ సీనియర్ నాయకులు సగ్గుర్తి ఈశ్వరరావు, సురేష్, బోస్, గోలి శ్రీనివాసరావు, ఆకుల దుర్గారావు, షేక్ ఖాసీం, కాలే ప్రసాద్, డేవిడ్ రాజు, శ్రీనివాసరావు, వసంత్ , లక్కు శాంతి, వాకాడ శ్రీను, కె.లక్ష్మీ, నాషీద్ లతో పాటు ప్రభుత్వ శాఖల నుంచి సివిల్ సప్లయ్స్ ఎ.ఎస్.వో, టిడ్కో జె.వో, సచివాలయ సిబ్బంది, పోలీస్ విభాగ సిబ్బంది, హెల్త్ , ఎలక్ట్రిక్ , కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0