వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం
వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం
జగ్గయ్యపేట, ఫిబ్రవరి16, (వెలుగు నాడు ప్రతినిధి) : పట్టణంలోని శ్రీఈశ్వరి దేవి మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘం,స్వర్ణకార సంఘం కళ్యా ణోత్సవంలో పాల్గొనగా అర్చకులు ఎస్ సాయిరాం కళ్యాణ క్రతువులను జరిపించారు. అనంతరం మందిరంలోని పాదరసలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు,లింగోద్భవ సమయంలో అన్నాభిషేకం నిర్వహించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0