పిరమిడ్ శిఖరంపై భాసించిన ఉదయ సూర్య బింబం
పిరమిడ్ శిఖరంపై భాసించిన ఉదయ సూర్య బింబం
జగ్గయ్యపేట,మార్చి15, (వెలుగు నాడు ప్రతినిధి ) : జగ్గయ్యపేట పట్టణంలోని మున్సిపల్ పార్కులో ఉన్న, బుద్ధ విహార్ ధ్యాన పిరమిడ్ వద్ద ఆదివారం ఉదయం అద్భుత దృశ్యం ప్రకృతి ఆవిష్కరించింది.ఉదయ సూర్యబింబం పిరమిడ్ శిఖరంపై సాక్షాత్కరించింది.బుద్ధ విహార్ ప్రాంతంలో సువర్ణ కాంతులు విరాజిల్లడంతో ఉదయం నడకకు విచ్చేసిన ప్రకృతి ప్రేమికులు ఈ దృశ్యాన్ని కన్నుల పండుగగా వీక్షించారు.అదే సమయంలో అక్కడ ఉన్న ప్రకృతి ప్రేమికుడు, ఉపాధ్యాయుడు పర్చా లక్ష్మణరావు తన సెల్ కెమెరాలో ఈ దృశ్యాలను పదిలం చేసాడు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0