ఉక్కు కళావేదికపై నారీ శక్తి గర్జన

Mar 9, 2026 - 00:25
 0  8
ఉక్కు కళావేదికపై నారీ శక్తి గర్జన

ఉక్కు కళావేదికపై నారీ శక్తి గర్జన

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

జగ్గయ్యపేట,మార్చి 08,(వెలుగునాడు ప్రతినిధి)  : పట్టణంలోని ఉక్కు కళా’ వేదిక ఆదివారం మహిళా చైతన్యానికి వేదికైంది. జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ మహిళల ఆర్థిక బలోపేతం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు.మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం మాత్రమే కాదు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది..సామాజిక వివక్షను అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడమే మహిళా దినోత్సవం అసలు ఉద్దేశమని అన్నారు.అనంతరం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ మహిళల ప్రగతి దేశానికి గర్వకారణమని అన్నారు.నేటి సమాజంలో మహిళలు శాస్త్ర సాంకేతిక రంగాల నుండి దేశ రక్షణ వరకు అన్నింటా అగ్రగామిగా నిలుస్తున్నారు.ఇప్పటికే వివిధ రంగాల్లో శిఖరాగ్రాన్ని చేరిన మహిళలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.యశోద హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ రేష్మ ప్రియాంక మాట్లాడుతూ మహిళల ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించారు.పట్టణానికి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సాయి సుష్మిత మాట్లాడుతూ నేటి కాలంలో మహిళలు సిఏ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు.మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర పట్టణ అభివృద్ధిలో మహిళల పాత్రను కొనియాడగా, మున్సిపల్ కమిషనర్ తులసి వెంకటకృష్ణారావు కార్యక్రమ విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ,పెనుగంచిప్రోలు తహసీల్దార్ శాంతి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భవాని,అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రమీల, ఐసీడీఎస్ సీడీపీవో సత్యవతి,ఏసీడీపీవో సరళ,హార్టికల్చర్ ఆఫీసర్ నీలిమ,జగ్గయ్యపేట పీహెచ్‌సీ డాక్టర్ ఎస్.కె. షైలా,గర్ల్స్ హై స్కూల్ హెడ్‌మాస్టర్ ,హేమా మాధవి, జగ్గయ్యపేట పీహెచ్‌సీ డాక్టర్ రేవతి,షేక్ నసీమూన్, ఐకేపీ కవిత, కర్ల కోటేశ్వరి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం చివరలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మహిళలను అతిథులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్