ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయి దేవినేని ఉమామహేశ్వరరావు
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయి దేవినేని ఉమామహేశ్వరరావు
విజయవాడ,జనవరి 18,( వెలుగు నాడుప్రతినిధి ): .స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్థంతి సందర్భంగా, ఎన్టీఆర్ జిల్లా భవానీపురం 40వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొనుగుపాటి వెంకటసుబ్బయ్య మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్థంతి వేడుకలు, అన్నదాన కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించిన తర్వాత, ఆయన స్వయంగా అన్నదాన కార్యక్రమంలో చురుకుగా పాల్గొని పేదలకు అన్నదానం చేసారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవినేని ఉమా మాట్లాడుతూ, "అన్న ఎన్టీఆర్ అమరుడు! తెలుగు జాతి గర్వం ఆయన సేవలు, ఆశయాలు ఎన్నటికీ అంతరించవు. 300కి పైగా సినిమాల్లో నటించారని, తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు ప్రజలను ఐక్యం చేశారన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, రూ.2కు కిలో బియ్యం పథకంతో పేదల ఆకలిని తీర్చారు. ఆయన ఆత్మగౌరవ నినాదం ఇప్పటికీ మన రక్తంలో పరుగులెత్తుతోంది" అని భావోద్వేగంతో కీర్తించారు. ఎన్టీఆర్ ఆశయాలు ఈనాటికీ మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి, పార్టీ కార్యకర్తలు ఆ మార్గంలోనే సాగి, ప్రజల సేవ చేయాలి" అని పేర్కొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1