తల్లిదండ్రుల ప్రోత్సాహమే నా విజయ రహస్యం

Mar 12, 2026 - 03:07
 0  14
తల్లిదండ్రుల ప్రోత్సాహమే నా విజయ రహస్యం

తల్లిదండ్రుల ప్రోత్సాహమే నా విజయ రహస్యం

యూపీఎస్సీ సివిల్స్‌లో 520వ ర్యాంక్ సాధించిన హర్షిత

ఎన్టీఆర్ జిల్లా, మార్చి 11, (వెలుగినాడు ప్రతినిధి) : ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షల ఫలితాల్లో 520వ ర్యాంక్ సాధించిన మేదర హర్షితను బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ కొత్తపేటలో ఉన్న ఆమె స్వగృహంలో పలువురు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా హర్షిత మాట్లాడుతూ తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. హర్షిత తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజల సమస్యలను సమీపంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్న విధానం చిన్ననాటి నుంచే తనపై ప్రభావం చూపిందన్నారు. ఎంతో మంది తమ కష్టాలు చెప్పుకుంటూ తన తండ్రిని ఆశ్రయించే సందర్భాలు చూసినప్పుడు తాను కూడా సమాజానికి సేవ చేయాలనే సంకల్పం పెరిగిందని చెప్పారు. ఆ ఆలోచనతోనే బీటెక్ చదువుతున్న సమయంలో సివిల్ సర్వీసులను లక్ష్యంగా పెట్టుకుని కృషి చేసి ఈ విజయాన్ని సాధించానన్నారు. హర్షిత తండ్రి విజయవాడ ట్రాఫిక్ సీఐగా పనిచేస్తున్న సుధాకర్ అన్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ప్రముఖ రచయిత, ఏపీజే ఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అన్నవరపు బ్రహ్మయ్య, ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి,రచయిత యేమినేని వెంకటరమణ, యాత్ర లోకం మాసపత్రిక సంపాదకులు తాళ్లూరి అనిల్ కుమార్, వసంత ప్రభ దినపత్రిక సంపాదకులు వసంత్ తదితరులు హర్షితతో పాటు ఆమె మాతృమూర్తిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్