దేశరక్షణలో సాయుధ దళాల సేవలు అమూల్యం ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
దేశరక్షణలో సాయుధ దళాల సేవలు అమూల్యం ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట, జనవరి26 ( వెలుగు నాడు ప్రతినిధి ) : పట్టణంలోని తొర్రగుంటపాలెంలో ఎంపీయూపీ స్కూల్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర హాజరై,సీఏపీఎఫ్ జవాన్లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడడంలో సాయుధ దళాల సేవలు అమూల్యమైనవని అన్నారు.దేశ రక్షణలో నిరంతరం కృషి చేస్తున్న జవాన్లను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలనిసూచించారు.అనంతరం జవాన్లు విద్యార్థినీ-విద్యార్థుల కోసం తీసుకువచ్చిన గిఫ్టులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0