అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న తిరువూరు నియోజకవర్గం
అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న తిరువూరు నియోజకవర్గం
ఎమ్మెల్యే కొలికపూడి కృషి ఫలితమే అంటున్న విశ్లేషకులు
ఎన్టీఆర్ బ్యూరో ఫిబ్రవరి 08 (వెలుగు నాడు ప్రతినిధి ) : తిరువూరు, నియోజకవర్గం అంటే నేడు అభివృద్ధికి ప్రతీకగా మారింది అంటే అందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అంకితభావం, ప్రజాపక్షపాత పాలన అని చెప్పక తప్పదు. రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్న ఈ రోజుల్లోనూ ప్రజల సమస్యలను తనవిగా భావించి పనిచేస్తున్న నేతగా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.ఎన్నికల సమయంలో మాత్రమే కాదు,ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండే నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు. గ్రామం ఏదైనా, కాలనీ ఏదైనా సమస్య విన్న వెంటనే స్పందించడం, అధికారులను రంగంలోకి దించి పరిష్కారం చూపించడం ఆయన పనితీరుకు నిదర్శనం. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, విద్య ఇలా ప్రతి రంగంలో తిరువూరులో కనిపిస్తున్న మార్పుకు ఆయన కృషి ప్రధాన కారణం.ప్రత్యేకంగా పేదలు, రైతులు, మహిళలు, యువత కోసం తీసుకున్న నిర్ణయాలు ప్రజల మనసులను గెలుచుకున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా పర్యవేక్షణ చేయడంలో ఆయన చూపిస్తున్న నిబద్ధత ప్రశంసనీయం. సమస్య చెప్పడానికి ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకునే ప్రజానాయకుడు అని తిరువూరు ప్రజలు గర్వంగా చెబుతుంటారు.రాజకీయ లాభనష్టాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధే తన ఏకైక లక్ష్యం అన్నట్టుగా ముందుకు సాగుతున్న కొలికపూడి శ్రీనివాసరావు, తిరువూరు ప్రజలకు నిజమైన మార్గదర్శకుడిగా నిలిచారు.కష్టకాలంలో అండగా ఉండే నాయకుడిగా, అభివృద్ధి బాటలో ముందుండే శక్తిగా ఆయన పేరు నిలిచిపోయింది.అందుకే నేడు తిరువూరు నియోజకవర్గం అంటే అభివృద్ధి, సంక్షేమం, ప్రజాసేవ అనే మూడు మాటలు గుర్తుకు వస్తాయి.ఆ మూడు మాటల వెనుక నిలిచిన నాయకుడు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.రాజకీయాలు అంటే అధికారమో, పదవో కాదు.ప్రజల కన్నీళ్లను తుడిచే చేయే నిజమైన నాయకత్వం.ఎవరో ఒకరు సహాయం చేయాలనే ఆశతో ఎదురు చూస్తున్న పేద కుటుంబం దగ్గర నుంచి భూమి, పంటల సమస్యలతో అలమటిస్తున్న రైతు వరకు చదువుకోసం పోరాడుతున్న విద్యార్థి నుంచి…ఆసుపత్రి మెట్లెక్కే ధైర్యం లేని నిరుపేద వరకు…ప్రతి బాధకూ స్పందించే మనిషే ఆయన.పార్టీ చూసి కాదు.వర్గం చూసి కాదు.ఓటు వేశారా లేదా అన్న ప్రశ్న లేకుండా మనిషి బాధే తన బాధగా* భావించే మనసు ఆయనది.రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఫోన్ మోగితే చాలు స్పందించే నాయకుడు కావడం ఈ రోజుల్లో అరుదైన విషయం.అలాంటి అరుదైన నాయకుడు తిరువూరుకు దక్కడం ప్రజల అదృష్టం అని చెప్పాలి.చిన్న చిన్న సమస్యలకైనా నేనున్నాను అని భరోసా ఇచ్చే తీరు అది మాటల్లో కాదు, పనుల్లో కనిపించడం.అదే కొలికపూడి శ్రీనివాసరావు ప్రత్యేకత.రోడ్డు వేస్తే అభివృద్ధి అనుకోవచ్చు.పథకాలు ఇస్తే ప్రభుత్వం అనుకోవచ్చు.కానీ బాధలో ఉన్న మనిషికి భరోసా ఇవ్వడం అనేది నాయకుడి హృదయం ఉన్నప్పుడే సాధ్యం.అందుకే తిరువూరు నియోజకవర్గ ప్రజలు అంటారు.ఇదికదా ప్రజలతో నడిచే తీరు.తిరువూరు ప్రజలు అనుకునే పేరు.మేము కొలికపూడి తాలూకా అని.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0