ఎస్.హెచ్ .జి మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్న ఎన్.ఐ.ఆర్.డి, ఎఫ్.డి.డి.ఐ సంస్థల శిక్షణా కార్యక్రమం

Feb 10, 2026 - 21:51
 0  12
ఎస్.హెచ్ .జి మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్న ఎన్.ఐ.ఆర్.డి, ఎఫ్.డి.డి.ఐ సంస్థల శిక్షణా కార్యక్రమం

ఎస్.హెచ్ .జి మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్న ఎన్.ఐ.ఆర్.డి, ఎఫ్.డి.డి.ఐ సంస్థల శిక్షణా కార్యక్రమం

ప్రకటన విడుదల చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కేశినేని ఫౌండేషన్ కార్యాలయం

ఎన్టీఆర్ బ్యూరో ఫిబ్రవరి 10 (వెలుగునాడు ప్రతినిధి) : జిల్లా పరిధిలోని,విజయవాడ.ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.ప్రధాన కార్యాలయంలో హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రోడ‌క్ట్స్ త‌యారీ పై నైపుణ్యాభివృద్ది శిక్షణ పొందుతున్న ఎన్టీఆర్ జిల్లాకి చెందిన‌ ఎస్.హెచ్.జి మహిళలు ఈ శిక్ష‌ణ ను స‌ద్వినియోగ‌ పర్చుకుంటున్నారు.ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో రెండు రోజు మంగ‌ళ‌వారం ఎన్.ఐ.ఆర్.డిలో హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రోడ‌క్ట్స్ త‌యారీ పై ఎస్.హెచ్.జి మహిళలు పొందిన శిక్షణ వివరాలను తెలియజేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని ఫౌండేషన్ కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.హ్యాండ్ మేడ్ పేపర్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి గాంధీ హ్యాండ్ మేడ్ పేపర్ యూనిట్ అధికారి జె.రవీంద్రరావు నేతృత్వంలో హ్యాండ్ మేడ్ పేపర్ ను ఉపయోగించి పేపర్ బాగ్స్, ఫోటో ఫ్రేమ్ ఏ విధంగా తయారు చేయాలి...ఫోటో ఫ్రేమ్ డిజైన్స్, పేపర్ బాగ్స్ తయారీ కి మెటీరియల్ సెలక్షన్ గురించి, ఎల్.పోల్డర్ తయారీ పై, ఫైల్ తయారీ కోసం కొలతలు ఏ విధంగా తీసుకోవాలి, ఫైల్స్ డిజైన్ ఎలా వుండాలి.హ్యాండ్ ఆన్ పోల్డర్ గురించి అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం వీటిని ఎలా తయారు చేయాలో శిక్షణ ఇచ్చారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్