పోలీస్ స్టేషన్ లో గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Jan 31, 2026 - 04:43
 0  17
పోలీస్ స్టేషన్ లో గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

పోలీస్ స్టేషన్ లో గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

తిరువూరు,జనవరి 30, (వెలుగు నాడు ప్రతినిధి ) : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తిరువూరు పోలీస్ స్టేషన్‌లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయనకు నివాళులు సమర్పించారు.ఈ కార్యక్రమంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని గాంధీజీ బోధించిన సత్యం, అహింస, శాంతి మార్గాల ప్రాధాన్యతను స్మరించుకున్నారు.గాంధీజీ చూపిన మార్గం నేటి సమాజానికి ఎంతో ప్రాసంగికమని వారు పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను తమ జీవితాల్లో ఆచరించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్