డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్న యుటిఎఫ్

Feb 24, 2026 - 23:28
 0  11
డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్న యుటిఎఫ్

డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్న యుటిఎఫ్

  1. జగ్గయ్యపేట, ఫిబ్రవరి 24,( వెలుగు నాడు ప్రతినిధి): . డ్రగ్స్ వద్దు బ్రో "అంటూ ప్రజలలో అవగాహన కల్పించుటకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ లో పనిచేయుచున్న ఐదుగురు మహిళ కానిస్టేబుల్స్ చేపట్టిన సైకిల్ యాత్ర కార్యక్రమం మంగళవారం గౌరవరం గ్రామాానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు కట్ట వెంకట నరసయ్య, డిసిపి, ఏసిపి, జగ్గయ్యపేట, చిలకల్లు ఎస్సైలు మరియు సిఐ పి వెంకటేశ్వరరావు గ్రామ ప్రజలు ఈ సైకిల్ యాత్రలో పాల్గొని ప్రజలకు డ్రగ్స్ తీసుకోవడం వలన కలిగే ప్రమాదాన్ని వివరించారు. దీని నివారణ కోసం ప్రజలు, ప్రభుత్వం, సమాజం, ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని డిసిపి మరియు గ్రామ పెద్ద కట్ట వెంకట నరసయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా గౌరవ అధ్యక్షులు మహేశ్వర వెంకటేశ్వరరావు యుటిఎఫ్ "యువత మేలుకో డ్రగ్స్ కి దూరంగా ఉండు" అంటూ యుటిఎఫ్ రాష్ట్ర సంఘం ప్రచురించిన గ్రామంలోని పెద్దలకు, గ్రామ ప్రజలకు మరియు విద్యార్థులకు, తల్లిదండ్రులకు పంపిణీ చేయుచు డ్రగ్స్ యొక్క ప్రమాదాన్ని దాని నివారణ మార్గాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణారావు, శంకర్, రాజేష్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్