దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీ వీ ఎన్ మాధవ్ ఎమ్మెల్యే సుజనా చౌదరి
ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందిన కేంద్రమంత్రి.
స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో శీనా నాయక్
విజయవాడ జూన్ 16, (వెలుగు నాడు ప్రతినిధి) : కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రలహాడ్ జోషి మంగళవారం.విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వెంట విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి.సత్యనారాయణ చౌదరి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీన్ మాధవ్ , బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డురి శ్రీరామ్ , తదితరులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ , కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ కేంద్రమంత్రికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా అమ్మవారికి కేంద్రమంత్రి ప్రత్యేక పూజలను నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ వేదపండితులు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి వేదాశీర్వచనం అందించగా దుర్గగుడి చైర్మన్ బోర్ర రాధాకృష్ణ ఈవో శీనా నాయక్ లు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు బుల్లబ్బాయి శ్రీనివాసరావు రావు, రాఘవ రాజు, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0