మహాత్ముని ఆశయాలు సాధిస్తాం.మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
మహాత్ముని ఆశయాలు సాధిస్తాం.మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
గొల్లపూడిలో ఘనంగా గాంధీ వర్ధంతి.
విజయవాడ,జనవరి30, (వెలుగు నాడు ప్రతినిధి ) : మహాత్ముని జీవితం యావత్ ప్రపంచ మానవాళికి స్ఫూర్తి సందేశమని, మహాత్ముని ఆశయాలు సాధిస్తామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో శాసనసభ్యుని వారి కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీజీ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గాంధీజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ సత్యం, అహింసలనే ఆయుధాలుగా మలుచుకుని దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన మహనీయులు మహాత్మా గాంధీ అని కొనియాడారు.సత్యం, అహింసలే ఆయుధాలైన జాతిపిత మహాత్ముని జీవితం ఆదర్శమన్నారు. సత్యాగ్రహంతో, సహాయ నిరాకరణతో, అహింసా మార్గంలో నడిచి భారతీయులకు బానిసత్వం నుంచి విముక్తి కలిగించారని అన్నారు. మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ స్థాపనను సీఎం చంద్రబాబు గారు సాకారం చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0