అంతర్జాతీయ ఉద్రిక్తతలతో పెట్రోల్ ధర పెరిగితే చంద్రబాబు ప్రభుత్వానికి ముడిపెడతారా
అంతర్జాతీయ ఉద్రిక్తతలతో పెట్రోల్ ధర పెరిగితే చంద్రబాబు ప్రభుత్వానికి ముడిపెడతారా?
జగన్ రెడ్డి విమర్శలు హాస్యాస్పదం : తంగిరాల సౌమ్య
నందిగామ మే 18, (వెలుగు నాడు ప్రతినిధి) .అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దేశవ్యాప్తంగా కేంద్ర చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా సవరించగా, దానిని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి తీరుపై ప్రభుత్వ విప్ మరియు నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై జగన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ, దేశవ్యాప్త నిర్ణయం – రాష్ట్రానికి సంబంధం లేదు, ప్రస్తుతం జరిగిన ఇంధన ధరల మార్పు కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జరగలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర సంస్థల నిర్ణయం మేరకు ఒకే విధంగా అమలైంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లేదా ఢిల్లీలో పెరిగిన ధరలకు కూడా కూటమి ప్రభుత్వమే కారణమా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు, కనీస అవగాహన లేకుండా ప్రతి అంశాన్ని రాజకీయ విమర్శలకు వాడుకోవడం జగన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. నాడు జగన్ రెడ్డి ‘బాదుడు’… నేడు కూటమి ‘భద్రత’ వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ… జగన్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా వ్యాట్ పన్నులు, ప్రత్యేక రోడ్డు సెస్సులు విధించి ప్రజలపై భారీ భారం మోపిందని తెలిపారు. రోడ్లు వేయకుండానే ప్రజల సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. నాటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల పెరిగిన పన్నులను తగ్గించాలనే డిమాండ్‌తోనే తెలుగుదేశం పార్టీ పోరాడిందని… కానీ నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై కొత్తగా ఒక్క పైసా కూడా రాష్ట్ర పన్ను విధించలేదని స్పష్టం చేశారు.యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా జరిగిన స్వల్ప ధరల సవరణను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం వైసీపీ రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.ప్రజానుకూల పాలన – బాధ్యతాయుత ప్రభుత్వం గత ప్రభుత్వం ఐదేళ్లలో పదేపదే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు కరెంట్ బిల్లుల షాక్ ఇచ్చిందని… కానీ నేటి కూటమి ప్రభుత్వం ప్రజలపై పైసా అదనపు భారం పడకుండా, విద్యుత్ ధరలు పెంచకుండా బాధ్యతాయుతంగా పాలన సాగిస్తోందని సౌమ్య కొనియాడారు. అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ… రాష్ట్ర పరిధిలో ఎలాంటి అదనపు పన్నులు విధించకుండా ప్రజలను కాపాడే దిశగా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలియజేశారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని లూటీ చేసి, ప్రజలపై అనేక రకాల భారం మోపిన జగన్ మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదని… ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకుని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని తంగిరాల సౌమ్య హితవు పలికారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0