వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు
జగ్గయ్యపేట,జనవరి 29,( వెలుగు నాడు ప్రతినిధి) : తాడేపల్లి వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి నియోజకవర్గంలో సంస్థాగత పార్టీ గ్రామ కమిటీ నిర్మాణ పై మాట్లాడటం జరిగింది.దాదాపు నియోజకవర్గంలో 8000 పైగా ఇప్పటివరకు పూర్తయ్యాయని, మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో పూర్తవుతాయని, కమిటీ నిర్మాణంలో కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించామని తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఈ సంస్థాగత పార్టీ కమిటీ నిర్మాణాన్ని 8000 పైగా అతి తక్కువ సమయంలో పూర్తి చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు, ఇదే ఉత్సాహంతో నియోజకవర్గంలో ముందుకు పోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు శీలం మంగరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మన్నే అప్పారావు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0