కాలుష్య రక్కసి మీద కలిసి కట్టుగా ఉద్యమిద్దాం జెఏసీ ప్రెసిడెంట్ ధరణికోట వెంకటరమణ
జగ్గయ్యపేట జనవరి14 (వెలుగునాడు న్యూస్) : కాలుష్య కారక కర్మాగారాల స్వలాభాపేక్ష,ప్రభుత్వ ఉదాసీనత కారణంగా జగ్గయ్యపేట పట్టణం కాలుష్య కాసారంగా మారింది.దీనిపై కలసికట్టుగా ప్రజా ఉద్యమం తప్పని సరి అని జేఏసీ ప్రెసిడెంట్ ధరణి కోట వెంకటరమణ అన్నారు. జేఏసీ ఫర్ స్వచ్ఛ జగ్గయ్యపేట వారిచే మంగళవారం పెన్షనీర్స్ భవనంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. చట్టాలమీద ఎలాంటి,గౌరవం,భయము లేకుండా, జగ్గయ్యపేట, ప్రజల ప్రాణాలకు విలువేలేదన్నట్లు, కెమికల్ దాడులు చేస్తూ జగ్గయ్యపేట ను మనుషులు నివసించలేని ప్రాంతంగా, చేస్తున్న కెమికల్ ఫ్యాక్టరీల దుర్మార్గాలను ఆపడానికి జేఏసీ ఏర్పడింది.లీగల్ సర్వీస్ అథారిటీ వారి వద్ద కేసు ఉండగాకలెక్టర్,ఎమ్మెల్యే,చైర్మన్,శాంపిల్స్ తీసుకొని, జగ్గయ్యపేట ఆటోనగర్ కెమికల్ ప్లాంట్ మీద చర్యలు తీసుకుంటాం.ఆల్రెడీ తీసుకుంటున్నామని చెప్పిన తర్వాత కూడా కాలుష్య కర్మాగారాలు వైఖరిలో మార్పు లేకపోవడం దారుణమని వెంకటరమణ అన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో జగ్గయ్యపేట ప్రజలు తమని తామే కాపాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందని గ్రహించి, జేఏసీగా ఏర్పడడం జరిగింది .ఇప్పటివరకు 26 సంఘాలు లో సభ్యులుగా ఏర్పడి, పార్టీలకు,కుల మతాలకి, అతీతంగా మన ఆరోగ్యం కోసం, భావితరాల జీవితాల కోసం,,ఈ కాలుష్య భూతాల మీద పోరాడటానికి సిద్ధపడటం జరిగింది స్వచ్ఛ జగ్గయ్యపేట కోసం..జగ్గయ్యపేట ప్రజల ప్రాణాల రక్షణ కోసం.కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళతామని అన్నారు.ఈ విషయంలో ప్రెస్ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ మందడపు శ్రీనివాసు,ట్రెజరర్ బొజ్జ రాజేష్, కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0