సియంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

Feb 5, 2026 - 02:20
 0  4
సియంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సియంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

గంపలగూడెం,ఫిబ్రవరి04( వెలుగు నాడు ప్రతినిధి ) : ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన సియంఆర్ఎఫ్ చెక్కులను గంపలగూడెం టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, ఏయంసి ఛైర్మన్ రేగళ్ల లక్ష్మీ అనిత,గంపలగూడెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎం.ఆర్.కె. రేగళ్ల వీరారెడ్డి మరియు టిడిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గోని.ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన 10,03,357 రూపాయల విలువైన సియంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లబ్ది పొందిన బాధితులు మాట్లాడుతూ అనారోగ్యంతో హాస్పిటల్స్ లో ఖర్చు పెట్టి ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకోవడంతో మేము హస్పిటల్స్లో ఖర్చు చేసిన మా డబ్బులు తిరిగి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)కు కృతజ్ఞతలు తెలిపారు,మేము సహాయం పొందడానికి సమయం చేసిన గంపలగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులకు రుణపడి ఉంటాము అని లబ్ధిదారులు తెలియజేసారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్