తిరుపతి లడ్డు కల్తీ అన్న మాటలు కల్పితాలే నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి తన్నీరు 

Feb 10, 2026 - 00:43
 0  10
తిరుపతి లడ్డు కల్తీ అన్న మాటలు కల్పితాలే నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి తన్నీరు 

తిరుపతి లడ్డు కల్తీ అన్న మాటలు కల్పితాలే నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి తన్నీరు 

జగ్గయ్యపేట, ఫిబ్రవరి 09, (వెలుగు నాడు ప్రతినిధి ) : తిరుపతి లడ్డూ కల్తీ అని చెబుతున్న కూటమి నాయకుల మాటలన్నీ కల్పితాలేనని వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు అన్నారు.జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లు గ్రామంలో రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్వీరాజ్ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడారు.గతంలో టీటీడీ బోర్డు నెంబర్ గా పనిచేసిన ఉదయభాను లడ్డులో జంతు కొవ్వు కలిసిందనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఇందులో ఎక్కడ వాస్తవాలు లేవన్నారు.వైసీపీ హయాంలో ఎక్కడా లేనివిధంగా దేవాలయాలు అభివృద్ధి జరిగింది.శ్రీ వాణి ట్రస్ట్ తో రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నింటినీ అభివృద్ధి చేసిన ఘనత జగన్ దే అన్నారు.జగ్గయ్యపేట నియోజకవర్గం లో కూడా 30 దేవాలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక్కొక్క దేవాలయానికి ఉచితంగా 10 లక్షలు అందించారని తెలిపారు.కేవలం రాజకీయంగా వాడుకోవడానికి తిరుమల తిరుపతి లడ్డూని తెరపైకి తీసుకువచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని,ఇప్పటికైనా లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం తప్పు జరిగిందని తెలుసుకొని వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణ చెప్పాలని తన్నీరు అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర మహిళ అధికారి ప్రతినిధి సంపత్ విజిత, జిల్లా కార్యదర్శి మాతంగి నాగబాబు, నియోజకవర్గ చేతి వృత్తుల విభాగా‌ అధ్యక్షులు గోవర్ధన్, మండల ఆర్టిఐ విభాగ అధ్యక్షులు మోషే, మండల బీసీ సెల్ అధ్యక్షులు సత్యనారాయణ, బలుసుపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్, మండల రైతు విభాగ కార్యదర్శి రామకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, గాలం గోపి పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్