రాజ్యాంగ హక్కులు పేదవారికి అందాలి న్యాయమూర్తి హిమబిందు
రాజ్యాంగ హక్కులు పేదవారికి అందాలి న్యాయమూర్తి హిమబిందు
జగ్గయ్యపేట, జనవరి26, ( వెలుగు నాడు ప్రతినిధి) : భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జగ్గయ్యపేట జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు జగ్గయ్యపేట కోర్టు ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు పేదవారికి అందగలిగితే అది ప్రజాస్వామ్య విజయమని అన్నారు. జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నెపాగ సుందరరావు, సీనియర్ న్యాయవాదులు బద్దుల వెంకటరామయ్య, ఈవీ జగన్నాధరావు, కాసరగడ్డ నాగేశ్వరావు, పసుపులేటి సత్య శ్రీనివాసరావు, జూనెబోయిన శ్రీనివాసరావు,కరణం నరసింహరావు,అన్నెపాగ కాంతారావు, రాయపూడి శ్రీనివాసరావు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0