వేదాద్రి గ్రామంలో రూ 2 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
వేదాద్రి గ్రామంలో రూ 2 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
జగ్గయ్యపేట ఏప్రిల్ 02 (వెలుగు నాడు ప్రతినిధి) : మండలంలోని వేదాద్రి గ్రామంలో 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) శంఖు స్థాపన చేశారు.డీఎల్ఎఫ్ నిధుల ద్వారా లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం వరకు రూ1.50 లక్షల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్లకు,రూ 30 లక్షల వ్యయంతో చేపట్టబోయే డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఇప్పటికే రూ 20 లక్షలతో నిర్మించిన నూతన డ్రైనేజీలు సిమెంట్ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు,స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0