లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

Feb 12, 2026 - 22:06
 0  1
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

జగ్గయ్యపేట ఫిబ్రవరి12 (తెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట లైన్స్ క్లబ్ ,ఆయుష్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వాగ్దేవి నర్సింగ్ కాలేజీలో 200 విద్యార్థులకు అవగాహనా సదస్సు, ఉచిత ఆయుర్వేద శిభిరం నిర్వహించారు.ఈకార్యక్రమములో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రత్న ప్రియదర్శిని మాట్లాడుతూ టీనేజి ఆడపిల్లలకు వచ్చే వివిధ రకాల సమస్యలు వాటి పరిష్కారం గురించి తెలియ చేసారు.క్లబ్ అధ్యక్షులు లయన్ బదరీ నారాయణ మాట్లాడుతూ 105 దేశాలలో విస్తరించి ఉన్న లయన్స్ క్లబ్ విస్తృతంగా సేవలు చేస్తునట్లుగా తెలిపారు.అనంతరం వివిధ సమస్యలతో భాధ పడుతున్న 200 వందల మందికి పరీక్షలు చేసి సుమారు 30 వేల రూపాయల మందులు ఉచితముగా ఇచ్చారు.ఈ కార్యక్రములో డాక్టర్ కవిత,డాక్టర్ విష్ణు వర్ధన్ నారాయణ్ ,లైన్స్ కార్యదర్శి ఖాసీం సైదా, కోశాధికారి రవికుమార్, సీనియర్ లయన్స్ సభ్యులు మహేష్,అమరనాధ్, వాగ్దేవి కళాశాల చైర్మన్ బుస్సాసురేష్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్