హోటల్స్ అసోసియేషన్ విమర్శలు సరికావు

Mar 12, 2026 - 03:04
 0  7
హోటల్స్ అసోసియేషన్ విమర్శలు సరికావు

హోటల్స్ అసోసియేషన్ విమర్శలు సరికావు

జగ్గయ్యపేట, మార్చి 11, (వెలుగు నాడు ప్రతినిధి) : పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న దరిమిలా దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా తగ్గిన సంగతి తెలిసి కూడా హోటల్ సంఘం అధ్యక్షుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సబబు కాదని ఎపి స్టేట్ ఎల్పీజీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాంకుమార్ అన్నారు.ఆయన బుధవారం జగ్గయ్యపేటలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్ల ఆగిపోయిన పరిస్థితి ఉందని, కేవలం హాస్పిటల్స్, మిడ్ డే స్కూల్స్, హాస్టల్స్ వంటి అత్యవసర వాటికి కొంతమేరకు సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీల నుండి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు మార్గదర్శకాలు జారీ అయ్యాయని తెలిపారు.సాధారణ పరిస్థితులలో ఆయిల్ కంపెనీల టార్గెట్స్ ఒత్తిడి మేరకు హోటల్స్ కు తాము డిస్కౌంట్ తో పాటు క్రెడిట్ కూడా ఇస్తూ కొన్ని సందర్భాల్లో ఆ బాకీలు వసూలు కాకుండా డిస్ట్రిబ్యూటర్లు లక్షల్లో నష్టపోతున్న పరిస్థితి ఉందని చెప్పారు.గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల వినియోగదారులు తమ సిలిండర్ డెలివరీని ఖచ్చితంగా ఒటిపి ద్వారా మాత్రమే తీసుకోవాలని, వినియోగదారులు అందరూ గ్యాస్ డెలివరీ బాయ్స్ కు సహకరించాలని కోరారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్