ప్రపంచానికే దిక్సూచి మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను
ప్రపంచానికే దిక్సూచి మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట,జనవరి 30,( వెలుగు నాడు ప్రతినిధి ) : మహాత్మాగాంధీ చూపిన చూపిన బాట కేవలం భారతీయులకే కాదు.. ప్రపంచ దేశాలన్నింటికీ దిక్సూచి అని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జగ్గయ్యపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ప్రపంచం యుద్ధాలు,హింసతోకొట్టుమిట్టాడుతున్న నేటి కాలంలో గాంధీజీ ప్రబోధించిన సత్యం, అహింస,శాంతి మార్గాలు మరింత ఆవశ్యకమయ్యాయని అన్నారు. గాంధీజీ అంటే కేవలం వ్యక్తి కాదు.. మహోన్నత ఆశయమని చెప్పారు. సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ వారిని గడగడలాడించారని, నా జీవితమే నా సందేశం' అంటూ చాటిచెప్పిన నిగర్వి అని కొనియాడారు. మహాత్మాగాంధీ మనకు భౌతికంగా దూరమైనా ఆయన ఆలోచనలు అమరమైనవని ఉదయభాను అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు,వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0