దేశ ఆర్థికాభివృద్ధిలో ఎల్‌ఐసీ కీలక పాత్ర ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
దేశ ఆర్థికాభివృద్ధిలో ఎల్‌ఐసీ కీలక పాత్ర ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట,జనవరి24,((వెలుగు నాడు ప్రతినిధి ) : దేశ ఆర్థికాభివృద్ధిలో ఎల్‌ఐసీ కీలక పాత్ర వహిస్తున్నదని స్థానిక ఎమ్మెల్యే శ్రీరాంరాజగోపాల్(తాతయ్య)అన్నారు.ఎల్‌ఐసీ ఏజెంట్స్ వృత్తి పరిరక్షణ దినోత్సవం (ఏపీపీ డే) సందర్భంగా ఎల్‌ఐసీ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో శాసనసభ్యులు తాతయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఎల్‌ఐసీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఎల్‌ఐసీ ఏజెంట్లు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ పరోక్షంగా దేశ సేవ చేస్తున్నారని కొనియాడారు.ఎల్‌ఐసీ ద్వారా ప్రజలకు భవిష్యత్ భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని ఆయన తెలిపారు.అనంతరం సీనియర్ ఏజెంట్లు,ఎమ్ డీ ఆర్ టీ ఏజెంట్లు, లైఫ్ క్లబ్ సభ్యులను శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రాఘవేంద్ర, కౌన్సిలర్లు కన్నెబోయిన రామలక్ష్మి, కంచేటి గీతారాణి, నకిరకంటి వెంకట్,ఎల్‌ఐసీ బ్రాంచ్ మేనేజర్ సత్యప్రసాద్, యూనియన్ ప్రెసిడెంట్ కొండయ్య,సెక్రటరీ సైదులు, ట్రెజరర్ నరేంద్ర,జోనల్ ఈసీ మెంబర్ వెంగల్ రావు,, డివిజన్ జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0