స్వర్ణాంధ్ర 2047 మాసపత్రిక ఆవిష్కరణ
స్వర్ణాంధ్ర 2047 మాసపత్రిక ఆవిష్కరణ
జగ్గయ్యపేట ఫిబ్రవరి10 (వెలుగు నాడు ప్రతినిధి ) : జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించిన స్వర్ణాంధ్ర 2047 మాసపత్రికను శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆయన నివాసంలో మంగళవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర 2047 విజన్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే దిశగా రూపొందించబడిందని అన్నారు.విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, సాంకేతికత వంటి కీలక రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అన్నారు.జగ్గయ్యపేట నియోజకవర్గం అభివృద్ధి కూడా ఈ విజన్‌లో కీలక భాగమని, నియోజకవర్గ ప్రజల భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మాసపత్రిక ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు,అభివృద్ధి పథకాలు, ప్రజలకు చేరువయ్యే సమాచారాన్ని సులభంగా అందించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మైనేని రాధాకృష్ణ,మారేపల్లి శౌరి, షేక్ అస్మతూన్ ఉమ్మర్,తోట కృష్ణ, హరినాథ్, మొగల్ నాగులు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0