న్యాయవాదుల నిరసన
న్యాయవాదుల నిరసన
జగ్గయ్యపేట ఫిబ్రవరి 09, (వెలుగు నాడు ప్రతినిధి ) : చేవెళ్ల బార్ అసోసియేషన్ న్యాయవాది స్వప్న కుమారి పాశవిక హత్యను,బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది మహమ్మద్ అల్తా మాస్ పై ఆటవిక దాడిని ఖండిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నెపాగ సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి సోమవారం నిరసన తెలియజేసారు.ఈ సందర్బంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అన్నెపాగ సుందరరావు, జూనెబోయిన శ్రీనివాసరావు, గోనెల వెంకటేశ్వర్లు,నరసింహరావు,ఆంజనేయులు, రావూరి ప్రసాద్, నాగరాజు,గోనుగుంట్ల శ్రీనివాస్ గౌడ్, దాసరి వెంకట కృష్ణ, గురువులు రాజు, చిన్న గాంధీ, రాజశేఖర్, నరేష్, అంకమ రాజు, శేష కుమారి పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0