సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
జగ్గయ్యపేట,ఫిబ్రవరి 19, (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట, పట్టణం విలియంపేట 14వ వార్డు మాజీ కౌన్సిలర్ మారేపల్లి శౌరి భార్య బాయమ్మ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని కోలుకున్నారు. వైద్య చికిత్సకు సంబంధించిన భారీ ఖర్చుల నేపథ్యంలో వారి కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దృష్టికి తీసుకురాగానే, వెంటనే ఎమ్మెల్యే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందేలా సిఫార్సు చేశారు.దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ₹4,32,592 (నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు) విలువైన చెక్కును ఈరోజు ఎమ్మెల్యే తాతయ్య గారు, శ్రీరాం చిన్నబాబు , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా తో కలిసి వారి నివాసంలో మారేపల్లి శౌరికి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ. అవసరంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆర్థిక, వైద్య సమస్యలు ఎదుర్కొన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0