సాగునీటి సమస్యపై అసెంబ్లీలో జీరో అవర్‌లో గళం విప్పిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య

Feb 12, 2026 - 21:48
 0  3
సాగునీటి సమస్యపై అసెంబ్లీలో జీరో అవర్‌లో గళం విప్పిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య

సాగునీటి సమస్యపై అసెంబ్లీలో జీరో అవర్‌లో గళం విప్పిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య

వత్సవాయి, ఫిబ్రవరి 12( తెలుగు నాడు ప్రతినిధి ) : జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన బోనకల్లు బ్రాంచ్ కాల్వ కింద వత్సవాయి, వీర్లపాడు, నందిగామ మండలాలకు సంబంధించిన వేలాది ఎకరాల భూములు సాగుపై ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ కాల్వ సామర్థ్యం 1350 క్యూసెక్కులు ఉండగా, ప్రస్తుతం కేవలం 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయడంతో బోనకల్లు మండలం దాటాక నీరు ముందుకు వెళ్లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వత్సవాయి మండలానికి కేవలం 30 క్యూసెక్కులకు మించి నీరు రావడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో బీబీసీకి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి, దాములూరు మేజర్‌కు కనీసం 350 క్యూసెక్కుల నీరు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఈ కీలక సాగునీటి సమస్యను గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జీరో అవర్ సందర్భంగా శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) సభ దృష్టికి తీసుకువెళ్లారు.రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను వివరించి,తక్షణమే బోనకల్లు బ్రాంచ్ కాల్వకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలని, దాములూరు మేజర్‌కు 350 క్యూసెక్కుల నీటిని కేటాయించాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి నిరంతరం పోరాడుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్