ఊరి బడిని కాపాడుకుందాం యూటీఎఫ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఊరి బడిని కాపాడుకుందాం యూటీఎఫ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 08, (వెలుగు నాడు ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చేపట్టిన ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులను చేర్పిద్దాం, ' ఊరి బడిని కాపాడుకుందాం ' కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆదివారం జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యూటీఎఫ్ సంఘం ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చిందని,దీనిని విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్యను పెంచి పేద, మధ్యతరగతి విద్యార్థులకు దేవాలయం లాంటి ఊరి బడిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షులు ఎం కృష్ణయ్య, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జె సుధానంద్, జగ్గయ్యపేట మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి ముక్తేశ్వరరావు,అల్లిక.నరసింహారావు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పెసరమెల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శులు యం డి మునీర్ బాషా, యం దేవదానం, యల్ యం డి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0