భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడు గుంతలే శాశ్వత పరిష్కారం

Jun 16, 2026 - 22:53
 0  4
భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడు గుంతలే శాశ్వత పరిష్కారం

భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడు గుంతలే శాశ్వత పరిష్కారం.

ఆర్డీవో కార్యాలయంలో ఇంకుడు గుంతల ప్రారంభోత్సవం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య

నందిగామ జూన్ 16, (వెలుగు నాడు ప్రతినిధి) : నందిగామ, మంగళవారం భూగర్భ జలాలను కాపాడుకోవాలంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయం, నివాస గృహం, వాణిజ్య సముదాయం వద్ద ఇంకుడు గుంతల ఏర్పాటు అత్యంత అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. నందిగామ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఇంకుడు గుంతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారులు, కూటమి నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను పరిశీలించి,వాటి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం భూగర్భ జలాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఇంకుడు గుంతల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ,వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంతలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.పెరుగుతున్న నీటి అవసరాలు,తగ్గుతున్న భూగర్భ జలాల నిల్వలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతల నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జల సంరక్షణ కార్యక్రమాలకు ప్రజలు సహకరించి భవిష్యత్ తరాలకు నీటి వనరులను అందుబాటులో ఉంచే బాధ్యతను అందరూ పంచుకోవాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో, మున్సిపల్ కార్యాలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్