అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

Jan 17, 2026 - 02:34
 0  3
అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

జగ్గయ్యపేట జనవరి16 (వెలుగు నాడు ప్రతినిధి) :  సంక్రాంతి పండుగ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని ముక్త్యాల రోడ్డు పాతపేట గడ్డ మీద ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని),కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెంరఘురామ్ ,శాసనసభ్యులుశ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి,మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర,మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు పాల్గొన్నారు.

ముందుగా వినాయక స్వామి ఆలయం నుండి పాతపేట గడ్డ స్టేజీ వరకు మహిళలు వేసిన ఆకర్షణీయమైన ముగ్గులను తిలకిస్తూ అతిథులు ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం గంగిరెద్దులాట, కోడి పందాలు వంటి సంప్రదాయ ఆటలు,చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ సంక్రాంతి పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు.ఇలాంటి సంబరాలు యువతకు మన సంప్రదాయాల విలువను తెలియజేస్తాయని, గ్రామీణ క్రీడలు, కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.జగ్గయ్యపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అభినందనీయమని అన్నారు.కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతులతో విడదీయరాని బంధం కలిగిన పండుగ అని, పల్లె సంస్కృతి పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవడమే మన బాధ్యత అన్నారు. యువత పాశ్చాత్య సంస్కృతికి లోనుకాకుండా మన పండుగల ప్రాముఖ్యతను తెలుసుకోవాలని సూచించారు.ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అన్నారు.మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాట్లాడుతూ పట్టణంలో ప్రజలందరూ కలిసి సంబరాలు జరుపుకోవడం ఆనందకరమని అన్నారు.మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ఆనందం, ఐక్యతకు ప్రతీక అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా,మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల సీతమ్మ, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 1
admin వెలుగునాడు తెలుగు న్యూస్