రాహ్-వీర్ భయం లేకుండా ప్రాణాన్ని కాపాడండి.
రాహ్-వీర్ భయం లేకుండా ప్రాణాన్ని కాపాడండి.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న ఎవరైనా బాధితులని రక్షించి ఆసుపత్రికి చేర్చినట్లయితే
రహవీర్ పథకం కింద 25000 పారితోషకం
నందిగామ, జనవరి 20,( వెలుగు నాడు ప్రతినిధి): రోడ్డు ప్రమాద, బాధితులకు సహాయం చేయడం మన అందరి బాధ్యత.జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల, సందర్భంగా మంగళవారం ఉదయం నందిగామ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్ మరియు శ్రీ పూజిత హాస్పిటల్ నందు ప్రభుత్వం అమలు చేస్తున్న రాహ్–వీర్ (Good Samaritan) చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించమనిఆర్‌టీఓ ఎం. పద్మావతి తెలిపారు.ఈ సందర్భంగా ఆర్‌టీఓ మాట్లాడుతూ,రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే వచ్చే మొదటి గంట (Golden Hour) అత్యంత కీలకమైందని, ఈ సమయంలో సరైన సహాయం అందిస్తే ప్రమాద తీవ్రతను మరియు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న ఎవరైనా బాధితులను రక్షించి ఆసుపత్రికి చేర్చినట్లయితే, వారిని గుడ్ సమారిటన్ (రాహ్–వీర్) గా గుర్తించి, సహాయం చేసిన వ్యక్తికి రూ. 25,000/- నగదు పారితోషికాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయబడుతుందని తెలిపారు.
అనంతరం మోటార్ వాహన తనిఖీ అధికారి, ఎం.పూర్ణిమ మాట్లాడుతూ,మోటార్ వాహన చట్టం సెక్షన్ 134A ప్రకారం, రోడ్డు ప్రమాద సమాచారాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు లేదా అత్యవసర సేవలకు తెలియజేసిన సందర్భంలో గానీ, క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చిన సమయంలో గానీ, గుడ్ సమారిటన్ వ్యక్తి పేరు లేదా వ్యక్తిగత వివరాలు ఇవ్వమని పోలీసులు లేదా ఆసుపత్రి సిబ్బంది బలవంతం చేయరాదని, అలాగే అతను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవడంపై ఎలాంటి అభ్యంతరం పెట్టరాదని స్పష్టం చేశారు.ఈ అవగాహన కార్యక్రమంలో ఆర్‌టీఓ ఎం. పద్మావతి , మోటార్ వాహన తనిఖీ అధికారి ఎం. పూర్ణిమ డాక్టర్ ఎం.శ్రీనివాస రావు, డాక్టర్ దివ్య వాణి, శ్రీ పూజిత హాస్పిటల్, వి. నాగేశ్వర రావు ఛైర్మన్, కే వి ఎస్ సత్యనారాయణ, సూపరింటెండెంట్, గవర్నమెంట్ హాస్పిటల్ ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0