సమాజం పై బాధ్యత తో ఎలా ఉండాలో ఆచరించి చూపిన ఆదర్శనీయుడు శ్రీరామ చంద్రుడు.

Mar 26, 2026 - 22:51
 0  3
సమాజం పై బాధ్యత తో ఎలా ఉండాలో ఆచరించి చూపిన ఆదర్శనీయుడు శ్రీరామ చంద్రుడు.

సమాజం పై బాధ్యత తో ఎలా ఉండాలో ఆచరించి చూపిన ఆదర్శనీయుడు శ్రీరామ చంద్రుడు.

హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం కష్టంలో కలిసి నడవాలన్నది సీతాతత్వం.

గులాబీ జెండా నె తెలంగాణ కు శ్రీరామ రక్ష.

జిల్లా ప్రజలకి శ్రీ రామనవమి పర్వదిన శుభాకాంక్షలు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.

సిద్దిపేట, మార్చి 26,(వెలుగు నాడు ప్రతినిధి) : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సమాజం పై బాధ్యతతో ఎలా ఉండాలో ఆచరించి చూపిన ఆదర్శనీయుడు శ్రీరామ చంద్రుడని హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం కష్టంలో కలిసి నడవాలన్నది సీతాతత్వం శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారు అని శ్రీరామున్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు నడవాలన్నారు.మానవ అవతారమూర్తులైన సీతారాములు ధర్మసంస్థాపనకు నిలువుటద్దంగా నిలిచారని స్పష్టం చేశారు. శ్రీరాముని అనుగ్రహముతో అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని ఈ యేడు వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ఆనందం తో పాడి పంటలతో వర్ధిల్లాలని భగవంతున్నీ ప్రార్ధిస్తున్నానాని అన్నారు.కెసిఆర్ నాయకత్వం లో కాళేశ్వరం ప్రాజెక్టు తో మండు టెండల్లో మత్తళ్లు దుంకాయన్నారు.నదులు, పర్వతాలు, సముద్రాలు ఉన్నన్ని రోజులు రామాయణం ఉంటుంది.రాముడు ఉంటాడని అలాగే కెసిఆర్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు చేసిన పనులు తెలంగాణ ఉన్నన్ని రోజులు ఉంటాయని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదన్నారు. కెసిఆర్ నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచి సుభిక్షంగా వర్ధిల్లిందని తెలంగాణ రాష్ట్రం కు గులాబీ జెండా కెసిఆర్ రే శ్రీరామ రక్ష అని అభిలాషించారు. శ్రీరామ నవమి సందర్బంగా శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాలని ప్రజలందరు ఆనందోత్సాహాల మధ్య సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్