స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు!

Mar 21, 2026 - 23:22
 0  3
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు!

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు!

నిరుద్యోగ యువతకు వరం: ఏ.కొండూరు మార్కెట్ యార్డులో నైపుణ్య శిక్షణ కేంద్రం?

మార్కెట్ యార్డ్ గోడౌన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. చైతన్య నగర్ సమీపంలో నైపుణ్య కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు.

తిరువూరు, మార్చి 21, (వెలుగు నాడు ప్రతినిధి) : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ ఏ.కొండూరు మండలంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ (AMC) యార్డును సందర్శించారు. చైతన్య నగర్ సమీపంలో ఉన్న ఈ మార్కెట్ యార్డ్ గోడౌన్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకుని, త్వరలోనే ఒక భారీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (నైపుణ్యాభివృద్ధి కేంద్రం) ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మార్కెట్ యార్డులో ఖాళీగా ఉన్న గోడౌన్లు శిక్షణ తరగతులు నిర్వహించడానికి, ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.గోడౌన్ల ప్రస్తుత పరిస్థితిని, మౌలిక సదుపాయాలను కలెక్టర్ సమీక్షించారు.యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది మరియు స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే తిరువూరు పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది యువతకు నైపుణ్య శిక్షణ లభించి, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికెట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ ఏ కొండూరు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్