విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) 

Jan 29, 2026 - 00:25
 0  10
విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) 

విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) 

జగ్గయ్యపేట, జనవరి 28, (వెలుగు నాడు ప్రతినిధి) : జగ్గయ్యపేట పట్టణంలోని, బాయ్స్ హై స్కూల్ కు ప్రభుత్వం అందజేసిన స్టడీ మెటీరియల్స్‌ను శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) విద్యార్థులకు స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ.ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిష్టాతులైన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా ఈ స్టడీ మెటీరియల్స్‌ను రూపొందింపజేయడం జరిగిందని తెలిపారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలు సాధించాలి అని ఆకాంక్షించారు.అలాగే ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలతో పాటు, దాతలు అందిస్తున్న సహాయ సహకారాలను కూడా సద్వినియోగం చేసుకొని విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నకిరకంటి వెంకట్,మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మల్లెల కొండయ్య, టి ఎన్ టి యు సి నాయకులు కర్ల జోజి ,స్కూల్హెచ్‌ఎంనాగేశ్వరరావు ఉపాధ్యాయులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
admin వెలుగునాడు తెలుగు న్యూస్